జీవితం
కరిగే కొవ్వొత్తిని చూస్తే తెలుస్తుంది,
జీవితం ఎలా కరిగి పోతుందో... !
అందమైన రంగు రంగుల పూలపై
వాలే తేనె టీగ,
పీల్చిన తీయని రస మకరందం,
లోభియై, మాపుకని దాచి,
లోకానికి తియ్యని అనుభూతిని అందించి,
మైనాన్ని కొవ్వొత్తి దారంతో దీపాన్ని వెలిగించి,
కష్టాల భరిస్తూ, కదులుతున్న కాలానికి,
కమ్మదనా న్ని అందిస్తుంది,
తాను కదులుతూ, కరుగుతూ,
తాను కదులుతూ, కరుగుతూ,
పరుల చీకటి పారద్రోలుతుంది.
అనంతమనే గది గోడల అంచుల వరకూ,
వెలుతురు జిమ్మే వెలుగుచుక్క,
వెన్నెల మొగ్గ ఈ కరెంటు బుగ్గ.
తనువునంత నూనెగా పోసి,
దేహమనే వత్తిని వేసి,
తన చుట్టు ఆవరించిన
చీకటి పొరలను పారద్రోలి,
జీవమనే వెలుగు వెలిగి,
ఎంత వెలుగునిస్తుందో...
ఈ దేహ పడవ...!
No comments:
Post a Comment