Saturday, 29 October 2016

యథ కొమ్మల బతుకమ్మలు

పుడమి తల్లికి పూసిన
పురివిచ్చిన పూమొగ్గలు
యెదకొమ్మల బతుకమ్మలు
భూమిక ప్రియాంకలు.

యేమైరీ యేమైరీ..
యెటుపోయిరి యెటుపోయిరి
కానరాక పోతిరీ

కుల స్వరాలు గొంతెత్తిన
ఆడ జాతి దు్మెత్తిన
ఆ బిడ్డల కనిపెట్టని
నీతి లేని జాతి కుక్క
రాజకీయ బురద పులిమి
కట్టుకథలతో మొరిగే !

యేడలేరు జాడలేదు
యేమైపోయిరీ,
అంతులేని వేదన
యావత్ జాతి రోదన.

నేల రాలిన మొగ్గల్లో
ఒక రెక్కను తెచ్చింది,
గాలి ఊర కుక్క....!

Saturday, 20 August 2016

ఈ గాలి పయనమెందాకా ఈ నేల ఎరుపు ఎందాకా

ఈ గాలి పయనమెందాకా ఈ నేల ఎరుపు ఎందాకా
ఆకాశం అంతా తిరిగి ఆడాలని,
అనువణువు అనుభవించి సాగిపోనా

గాలిలో యెగురుతూ రెక్కలున్న పక్షివలే
గగనంతరాలవరకు యెగిరి పోనా
రవికిరణపు చురుకునై రణరంగపు మేనిలో
చురకత్తిలగా నేను దూరిపోనా

నిప్పులోని మంటనై నీ వూపిరి ఉప్పెనై
పిరికితనపు మనిషిలో దూరిపోనా
నింగిలోన మేఘమై నేల జారు చినుకునై
జీవధార లాగా నేను సాగిపోనా

పూవులగా పరిమలిస్తు తేనెపంచు మమతనై
యెద యెదలో తీపి గురుతులోదిలిపోనా
ప్రకృతిలోన పలురకాల ఆకృతులను మార్చుకొని
ఆమనికే అందాలు అద్దిపోనా

స్వేచ్ఛ కోరు పక్షిలా సెలయేటి చేపలా
చంద్రునోలే చల్లగా వెలిగిపోనా
మంచి మనసు మామటనై మరుపురాని పాటనై
మహిత నిండ పండుగలా ఉండిపోనా

రచన తేది: 21.11.2004

Sunday, 26 June 2016

జీవితం

జీవితం 

కరిగే కొవ్వొత్తిని చూస్తే తెలుస్తుంది,
జీవితం ఎలా కరిగి పోతుందో... !
అందమైన రంగు రంగుల పూలపై
వాలే తేనె టీగ,
పీల్చిన తీయని రస మకరందం,
లోభియై, మాపుకని దాచి,
లోకానికి తియ్యని అనుభూతిని అందించి,
మైనాన్ని కొవ్వొత్తి దారంతో దీపాన్ని వెలిగించి,
కష్టాల భరిస్తూ,  కదులుతున్న కాలానికి,
కమ్మదనా న్ని అందిస్తుంది,
తాను కదులుతూ, కరుగుతూ,
పరుల చీకటి పారద్రోలుతుంది.
అనంతమనే గది గోడల అంచుల వరకూ,
వెలుతురు జిమ్మే వెలుగుచుక్క,
వెన్నెల మొగ్గ ఈ కరెంటు బుగ్గ.
తనువునంత నూనెగా పోసి,
దేహమనే వత్తిని వేసి,
తన చుట్టు  ఆవరించిన
చీకటి పొరలను పారద్రోలి,
జీవమనే వెలుగు వెలిగి,
ఎంత వెలుగునిస్తుందో...
ఈ దేహ పడవ...!

     

అరి వర్గాలు

నా కామం - కసి తీరేటంతా
నా క్రోధం - అంతులేనంతా
నా లోభం - లాభం లేనంతా
నా మోహం - విశాలమంతా
నా ఆకలి - వెలలేనంతా
నా దాహం - సముద్రమంతా

తేది: 01/07/2016

నా కవిత

నా కవిత 

నా కవితా ! నవ వనితా !
నా కలల సుందర భవితా !
సుమధుర మంజుల భాషితా !
సుమ శోభాయమాన భూషితా !
నా కవితా !

Thursday, 23 June 2016

నన్ను చూసి మొన్న గాలి యీల వేసింది


పల్లవి: నన్ను చూసి మొన్న గాలి యీల వేసింది 
పొద్దు వాలిపోయింది నీడ వెక్కిరించింది

చరణ:  మదిలోని భావాలు మల్లెపూల సరులయ్యి 
నాదు వర్ణ నా జెగాన కనువిందై కానరావా 
యెంత మధురమో నీ భావగీతికా 
వింత రాగమా నా ప్రణయ లాలస

చరణ:  ప్రకృతి కాంత ఎవరో నను పిలిచినట్టు అనిపించి 
వెనుతిరిగి వెతుకుతుంటే వేణుగాణ రాగంతో 
వొళ్ళు పులకరించి నా కళ్ళు కప్పి పాయే
జల్లు జల్లు మనుచు నా మనసు నాట్యమాడే

చరణ:  నింగిలోని తారలన్నీ తొంగి తొంగి చూస్తుంటే 
అందులోని చందమామ వంగి వంగి చూస్తుంటే 
ఆ భావ తరంగాలు నన్ను మీటినాయి 
వెన్న లాంటి వన్నె కవితా రాయమన్నాయి 


Saturday, 11 June 2016

నీ రాకకై

నీ రాకకై 

కన్నీళ్ళ చుక్కలన్నీ కలగలసి
ఎగేసుకోచ్చే దుఃఖం లా..,
కదిలి వచ్చిన కారుమబ్బులను చూసి,
ఆశపడిన మొక్కలా,
కురులనే మేఘ శిఖను కదిలిస్తే,
చిక్కుముడిని వీడిన చినుకు బాల లా,
ఎండిన మ్రానులా,
నింగికెగసి నీటి బొట్టుకై చుస్తున్నాను.
నీ రాకకై !
బీడువారిన పొలాల్లా గా ,
బిక్కు బిక్కుమని ఎదురు చూస్తున్నను.
చెట్లు మొలసిన చెరువుల్లా,
మనసు చెదిరి చుస్తున్నను.
వాగులాగా, వంకలాగా , డొంకలాగా
కళ్ళు పీక్కుపోయి చూస్తున్నాను,
 నీ రాకకై !

(రచన తేది:31/07/2004)

దవా

అల్లోపతిని అవైడ్ చేస్తే
అంతా మంచే జరుగుతుంది.
హోమియోపతి నీ ఇంట్లో ఉంటే
.ఫ్యామిలి సేఫ్ వుంటుంది.
నేచురోపతి నీ వనుసరిస్తే
ఫ్యూచర్ యెంతో బాగుంటుంది
ఆయుర్వేదం అలవాటైతే
ఆయువు యెంతో పెర్గుతుంది.
అభిమానం పోయేలా అప్పుచేయ వద్దు
ఉన్న పరువు పోయేలా తప్పు చేయవద్దు
ప్రాణం పోయిన యితరులకు ముప్పు చేయవద్దు.

 భార్య భర్తలు 

భార్య భర్తలుఎపుడూ స్నేహంగా వుండాలి 
వైవాహిక జీవితన వసంతాలు పండాలి
కొత్త కొత్త ఆలోచనలు కనిపెడుతూ వుండాలి

Friday, 10 June 2016

దేశ భక్తి గేయం

                 జయ జయ భారతీ 
పల్లవి:   జయ జయ భారతీ !
            సుఖ శాంతుల సారధి !

చరణం :  త్యాగధనుల కీర్తి పతక -రెప రెమని ఆడగా
              నధీ  నధుల  జల ధారలు పాదపూజ చేయగా
              పావని ఆమని పవిత్ర జనని - భారతీ !

చరణం:  ఇంద్ర ధనుసు పట్టుచీర నివు కట్టుకోవగా
              భూమి జనులు నిన్ను చూసి మురిసి పోవగా
              ఇందిరా సుందరా పవిత్ర జనని - భారతీ !

చరణం:  పసిడి పంటలన్ని నీకు కంట హార మాయెను
             ఖనిజ సంపదంత నీకు ఒడ్డాలము కావగా
             కుమారి కాశ్మీరా పవిత్ర జనని -భారతీ  !

చరణం:  శాస్త్రవేత్తలందరికి చక్కని ఆలోచనవై
             మేధావుల సంపత్తుకు మూలము కాగా
             సకల లోక సమభావని దివ్యధాత్రి -భారతీ  !



Thursday, 9 June 2016

రుబాయి

వుద్యోగం యిస్తానని ఊరూరికి చెప్పిండు
ఎలచ్చన్ల కొచ్చినపుడు యింటింటికి తిరిగిండు
కలిగంజి తాగి, అవ్వా ! మంచేనా నన్నడు
ఎలచ్చన్ల గెల్సినంక ఎవడురా నువ్వన్నాడు

రుబాయి

నిరు పేదలకు నిళ్ళులేని  రాజకీయమద్దు
నిరవదికం లేని రాజ్య పరిపాలన రద్దు
నిరుద్యోగ యువతరాన్ని నిరుగార్చుటద్దు
నిత్యముండె కొలువు చూపితే అదే వార్కి ముద్దు  

రంగులు

రంగు రంగు జెండాల
రాజకీయ దొంగలు
రంగు హంగు మార్చేటి
రాజకీయ నాయకులూ


నేను మహా సముద్రాన్ని

నేను సముద్రాన్ని
నేను మహా సముద్రాన్ని
పైకి నిర్మలంగా కన్పిస్తూ
భయంకర భాదల బడబాగ్నిననుభావిస్తూ
నాలో నేనే
రోజురోజుకు చచ్చి బ్రతికే
మహా సముద్రాన్ని !

అప్పుడపుడూ ...
అగ్ని శిఖరాల్ని బద్దలు కొడుతూ
లావా చిమ్ముతూ మేలే చేస్తాను.
అప్పుడపుడు
మేఘమై ఉరుకుతూ,
ఊరు వాడ తడుపుతూ,
పొలం చెరువు నింపుతూ,
ఏరువై  పారుతూ
సమస్తానికి ఉనికిలా....,
మానవ మనుగడకు జీవం పొస్తూ ,
చివరికి
నాలోనేనే కలిసిపోతా !

నన్ను కలుషితం చేయడం
ఎవరి తరం కాదు.
చిగురుటాకును సైతం
బయటకు విసిరి పారేస్తా

నా క్షుతిలో మహా నగరాలూ
రత్నాల రాసులు దా క్కోన్నాయి
నా తపసుకి భంగం కలిగించక,
వెతికి తీసుకొ....
నీకు మేలే చేస్తాను.
అలజడి సృష్టించావో అంతే నీ పని .

నేను సముద్రమై నీకు మేలే చేస్తాను.
పొగడ్తలకు పొంగిపోను,
అపనిందలకు కుంగిపోను,
నాలో అపర రత్న జ్ఞాన సంపదున్నా
సమస్తానికి సమానంగా పంచి పెడతా

నేను మహా సముద్రాన్ని


Wednesday, 8 June 2016

దేశ భక్తి

దేశ భక్తి 

దేశ భక్తి వున్నవాడే దేవుడోయి
మాతృ భక్తి వాడు మనిషోయి 
పుడితే ఒక జవాను గా పుట్టవోయి 
పురిటి గడ్డ ఋణం దీర్చుకోవోయి