ఈ మౌనమెంత కాలం
ఈ పయణమెంత దూరం
బతికిన ప్రతి క్షణం
నీవు భయపడకు నేస్తమా!
తనువున్నది చావో రేవో తేల్చిపో...
కడలిలో బడబాగ్ని పేలడం లేదా,
కడుపులో జఠరాగ్ని రగలడం లేదా
ఓదార్పు పుడమి పెకలడం లేదా,
నీ గుండెలో రోషం ఉప్పొంగ లేదా
జాగెందుకు సఖా!
చీకటి గోడలు బద్ధలుకొట్టి యుద్ధరంగాన గెలిచిపో
విశాల విశ్వం యిరుకు సందులో బంధీవై ఉన్నావు కదా!
కట్టలు తెంచే దుఃఖం కౌగిలిలో నలిగి పోతావెందుకు ?
మనో గృహానికి బిగించి వేసిన తలుపు కిటికీలు తెరిచూడు
ఓ నేస్తగాడా!
మానవత్వపు పరిమలాలు ఈ పుడమిపైన వెదజల్లిపో
తేది: 16-01-2005. (పరకాలలో ఉన్నపుడు రాసింది.)

No comments:
Post a Comment